Board Installed at Varahalagedda Site వరహాలగెడ్డ స్థలంలో బోర్డు పెట్టారు
ABN , Publish Date - Feb 05 , 2026 | 11:41 PM
Board Installed at Varahalagedda Site పార్వతీపురంలోని వరహాలగెడ్డ పరిధిలో ఉన్న సర్వే నెంబరు 410లో ప్రభుత్వ స్థలం రక్షణకు అధికారులు చర్యలు చేపట్టారు. ‘ ఇది ప్రభుత్వ భూమి.. ఆక్రమణదారులు శిక్షార్హులు.’ అని తెలియజేస్తూ హెచ్చరిక బోర్డు పెట్టారు.
పార్వతీపురం, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): పార్వతీపురంలోని వరహాలగెడ్డ పరిధిలో ఉన్న సర్వే నెంబరు 410లో ప్రభుత్వ స్థలం రక్షణకు అధికారులు చర్యలు చేపట్టారు. ‘ ఇది ప్రభుత్వ భూమి.. ఆక్రమణదారులు శిక్షార్హులు.’ అని తెలియజేస్తూ హెచ్చరిక బోర్డు పెట్టారు. ఇటీవల కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు ఆ ప్రాంతంలో బోర్డును తొలగించి పక్కనున్న తుప్పల్లో పడేశారు. దీంతో ప్రభుత్వ భూమి ఆక్రమణకు మళ్లీ కొంతమంది ప్రయత్నిస్తున్నారనే వాదనలు వినిపించాయి. దీనిపై ఈ నెల 3న ‘ప్రభుత్వ స్థలమా అయితే ఏంటంట?’ అనే శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. ఈ మేరకు గురువారం ఆ ప్రాంతంలో మళ్లీ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అయితే ఈ బోర్డును ఎన్నాళ్లు ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. మళ్లీ గుర్తు తెలియని వ్యక్తులు దానిని తొలగించే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలం రక్షణకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు.