Share News

బీఎల్వోలు అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Aug 23 , 2026 | 12:26 AM

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బూత్‌లెవల్‌ ఆఫీసర్లు(బీఎల్వో) అప్రమత్తంగా ఉండాలని బొబ్బిలి ఆర్డీవో రామ్మోహనరావు ఆదేశించారు.

బీఎల్వోలు అప్రమత్తంగా ఉండాలి
బీఎల్వోలతో మాట్లాడుతున్న ఆర్డీవో రామ్మోహనరావు

  • బొబ్బిలి ఆర్డీవో రామ్మోహనరావు

రామభద్రపురం, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బూత్‌లెవల్‌ ఆఫీసర్లు(బీఎల్వో) అప్రమత్తంగా ఉండాలని బొబ్బిలి ఆర్డీవో రామ్మోహనరావు ఆదేశించారు. శనివారం రామభద్రపురంలోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ ఆవరణలో ఉన్న పోలింగ్‌ బూత్‌లను పరిశీలించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ మండలంలోని 49 పోలింగ్‌ బూత్‌ల్లో కరెంటు, నీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. కొత్త ఓటర్లు నమోదుకు స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహి స్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వంగపండు గోపాలనాయు డు, ఎంఈవో ఆమిటి తిరుమలప్రసాద్‌, బీఎల్‌వోలు పాల్గొన్నారు.

Updated Date - Aug 23 , 2026 | 12:26 AM