రక్తదానం సామాజిక బాధ్యత
ABN , Publish Date - Jul 12 , 2026 | 12:22 AM
ప్రతి ఒక్కరూ రక్తదానాన్ని సామాజిక బాధ్యతగా భావించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి పిలుపునిచ్చారు.
సాలూరు, జూలై 11(ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ రక్తదానాన్ని సామాజిక బాధ్యతగా భావించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి పిలుపునిచ్చారు. శనివారం సాలూరు ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన మె గా రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం ప్రధానమంత్రి టీబీ ముక్తి భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా హ్యాండ్ హెల్డ్ ఎక్స్-రే మిషన్‌ను ప్రారంభించిన తర్వాత ఆమె మాట్లాడారు. ప్రతీ ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సమాజానికి సేవ చేయాలన్నారు. ఏరియా హాస్పిటల్ టీబీ యూనిట్ పరిధిలోని 28 హైరిస్క్ గ్రామాల్లో ప్రత్యేక టీబీ స్ర్కీనింగ్ కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. గ్రామాల్లోనే ఛాతి ఎక్స్- రేలు, కఫం పరీక్షలు నిర్వహించి టీబీనీ ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించనున్నామని వెల్లడించారు. ఇంటంటా టీబీ నిర్ధారణ సేవలు అంది స్తూ ప్రజల్లో వ్యాధిపై విసృత అవగాహన కల్పిస్తున్నామన్నారు. నిక్షయ్ మిత్ర ద్వారా టీబీ రోగులను దత్తత తీసుకుని ప్రతినెలా పోషకాహారం అందిం చేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె రక్తదాతలను అభినందించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.