Share News

మహిళా బిల్లును అడ్డుకోవడం హేయం

ABN , Publish Date - Apr 20 , 2026 | 12:10 AM

భారత నారీ శక్తిని ఎదగనీ యకుండా ప్రవేశపెట్టిన మహిళా బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకోవడం హేయమైన చర్యని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌వర్మ అన్నారు.

మహిళా బిల్లును అడ్డుకోవడం హేయం
కోట జంక్షన్‌లో నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ నాయకులు

-బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌ వర్మ

విజయనగరం దాసన్నపేట, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): భారత నారీ శక్తిని ఎదగనీ యకుండా ప్రవేశపెట్టిన మహిళా బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకోవడం హేయమైన చర్యని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌వర్మ అన్నారు. ఆదివారం కోట జంక్షన్‌లో మహి ళా మోర్చా, యువమోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రాహుల్‌ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తో పాటు టీఎంసీ, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీలు మహిళా శక్తిని తక్కువగా అంచనా వేశాయని అన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వం మహిళా బిల్లును ప్రవేశపెట్టి విశ్వా సం పొందుతామని అన్నారు. కార్యక్రమంలో నాయకులు వై.స్మిత, రాజాన రమణ, పతివాడ రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2026 | 12:10 AM