అభివృద్ధికి కట్టుబడే వారిని ఆశీర్వదించండి
ABN , Publish Date - Oct 30 , 2026 | 12:12 AM
అభివృద్ధికి కట్టుబడే వారికే ఓట్లు వేసి గెలిపించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనా యుడు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కోరారు.
మంత్రి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి, ఎమ్మెల్యే అదితి
కూటమి మేయర్ అభ్యర్థి భార్గవి తరపున ప్రచారం
విజయనగరం టౌన్, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): అభివృద్ధికి కట్టుబడే వారికే ఓట్లు వేసి గెలిపించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనా యుడు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కోరారు. గురు వారం వారు నగరంలోని బాలాజీ మార్కెట్, బాబా మెట్ట, 48వ డివిజన్‌లో కూటమి మేయర్ అభ్యర్థి అవనాపు భార్గవి, డివిజన్ అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మా ట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో వైసీపీ పాలనలో నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై పాలకులు దృష్టి సారించలేదని, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన రెండేళ్లలో నగరంలో కోట్ల రూపాయలతో పలు అభి వృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. నగర అభివృ ద్ధిని చూసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మేయర్ అభ్యర్థి అవనాపు భార్గవి మాట్లాడుతూ గడిచిన 30 ఏళ్లుగా తన కుటుంబం రాజకీయంలో ఉందని, తన మామయ్య మున్సిపాల్టీ చైర్మన్‌గా పనిచేసి నగరంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశరన్నారు. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన తనకు మళ్లీ నగర వాసులకు సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని కోరారు. ఎమ్మెల్యే అదితి సహాయంతో నగర ఆధునికీకరణకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి అభ్యర్థులతో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.