Blazing Agency Area మండుతున్న మన్యం
ABN , Publish Date - Apr 26 , 2026 | 11:48 PM
Blazing Agency Area జిల్లాలో ఎండలు మండుతున్నాయి. భానుడి ప్రతాపానికి జనం విలవిల్లాడిపోతున్నారు. ఎండ వేడి, ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటకు రాలేకపోతున్నారు.
పార్వతీపురం, ఏప్రిల్26(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎండలు మండుతున్నాయి. భానుడి ప్రతాపానికి జనం విలవిల్లాడిపోతున్నారు. ఎండ వేడి, ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటకు రాలేకపోతున్నారు. దీంతో మధ్యాహ్నం వేళల్లో ప్రధాన రహదారులు, కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఆదివారం సాలూరులో గరిష్ఠంగా 41.1 డిగ్రీలు, పాలకొండలో 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక పార్వతీపురంలో 35.7, పాచిపెంటలో 40.4, కురుపాంలో 37.7, మక్కువలో 39.7, బలిజిపేటలో 38.8, భామినిలో 39, గరుగుబిల్లిలో 38.9, గుమ్మలక్ష్మీపురంలో 37.7, జియ్యమ్మవలసలో 38.4, కొమరాడలో 35.7 వీరఘట్టంలో 39.9 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.