Share News

‘బీజేపీని బలోపేతం చేయాలి’

ABN , Publish Date - Apr 09 , 2026 | 12:16 AM

బీజేపీని బలోపేతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌వర్మ కోరా రు. బుధవారం రాజాంలో బీజేపీ కార్యా లయాన్ని ప్రారంభించారు.

‘బీజేపీని బలోపేతం చేయాలి’
మాట్లాడుతున్న రాజేష్‌వర్మ::

రాజాం రూరల్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యో తి): బీజేపీని బలోపేతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌వర్మ కోరా రు. బుధవారం రాజాంలో బీజేపీ కార్యా లయాన్ని ప్రారంభించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ ప్రజలు, ప్రభుత్వా నికి మధ్య వారధిగా పార్టీ నాయకులు పనిచేస్తారన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి సమస్యలున్నా కార్యకర్తలు, మండల నాయకుల దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని తెలిపారు. నియోజకవర్గం లోని ప్రజల అవసరాలు, సమస్యలు పరి ష్కరించడంతోపాటు వారికి చేరువయ్యేం దుకు వీలుగా రాజాం అర్బన్‌లో పార్టీ కా ర్యాలయాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా మాజీ అ ధ్యక్షులు బూరి దామోదరరావు, ఏపీఐ డీసీ డైరెక్టర్‌ కోటగిరి నారాయణరావు, పార్టీ నాయకులు వేమకోటి గిరిబాడు, శ్రీదేవి, చిన్నంనాయుడు, పెనుమత్స శ్రీని వాస్‌, వీరభద్రయ్య, అజయ్‌కుమార్‌, సింహాచలం, అమర్‌నాధ్‌, దేముడుబాబు, భద్రం, ఉదయ్‌కిరణ్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2026 | 12:16 AM