mustabu తొలి ముస్తాబు గ్రామం బియ్యాలవలస
ABN , Publish Date - Jan 07 , 2026 | 11:39 PM
Biyyala Valasa Village Gets a First mustabu జిల్లాలో తొలి ముస్తాబు గ్రామం బియ్యాలవలస అని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన ఆ గ్రామంలో పర్యటించారు. అక్కడ పరిశుభ్రత, రక్షిత నీరు, మురుగునీరు నిల్వ లేకపోవడాన్ని గుర్తించారు. గ్రామస్థులు పారిశు ఽఽధ్యానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలుసుకున్నారు.
కురుపాం రూరల్, జనవరి7(ఆంధ్రజ్యోతి): జిల్లాలో తొలి ముస్తాబు గ్రామం బియ్యాలవలస అని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన ఆ గ్రామంలో పర్యటించారు. అక్కడ పరిశుభ్రత, రక్షిత నీరు, మురుగునీరు నిల్వ లేకపోవడాన్ని గుర్తించారు. గ్రామస్థులు పారిశు ఽఽధ్యానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే బియ్యాలవలస గ్రామాన్ని అం దరూ ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవం రోజున గ్రామస్థులను సత్కరిస్తామని ప్రకటించారు. ఈ పర్యటనలో ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి , జేసీ యశ్వంత్ కుమార్‌రెడ్డి, సబ్ కలెక్టర్లు ఆర్. వైశాలి, స్వప్నిల్ జగన్నాఽథ్, డీపీవో కొండలరావు, ట్రైౖకార్ డైరెక్టర్ లావణ్య తదితరులు పాల్గొన్నారు.
రోగులకు అండగా నిలవాలి..
కురుపాం: రోగులకు అండగా నిలవడమే ‘హెల్పింగ్ హ్యాండ్స్’ ప్రఽదాన ఉద్దేశమని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం కురుపాం ఆసుపత్రిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘హెల్పింగ్ హ్యాండ్స్‌లో విద్యార్థులు, యువత, రిటైర్డు ఉద్యోగులు భాగస్వాములవ్వాలి. ఆసుపత్రికి వచ్చే రోగులకు సేవలందిస్తూ.. ఆదర్శంగా నిలవాలి. ఆసుపత్రుల్లో ఏ డాక్టర్‌ను కలవాలో, ఎక్కడ ల్యాబ్ పరీక్షలు చేయించుకోవాలో.. ఎలా మందులు వాడాలో తెలియక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి వారికి వలంటీర్లు పూర్తిగా సహకరించాలి. ’ అని కలెక్టర్ కోరారు.