25మందిపై బైండోవర్ కేసు
ABN , Publish Date - May 26 , 2026 | 11:54 PM
వండానిపేటలో శాంతిభద్రతల దృష్ట్యా ముంద స్తుగా టీడీపీ, వైసీపీలకు చెందిన 25 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్టు ఎస్‌ఐ బాలకృష్ణ మంగళవారం విలేకర్లకు తెలిపారు.
రేగిడి, మే 26(ఆంధ్రజ్యోతి): వండానిపేటలో శాంతిభద్రతల దృష్ట్యా ముంద స్తుగా టీడీపీ, వైసీపీలకు చెందిన 25 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్టు ఎస్‌ఐ బాలకృష్ణ మంగళవారం విలేకర్లకు తెలిపారు. ఈనెల 11న వండానిపేటలో టీడీపీ, వైసీపీ వర్గియుల మధ్య కొట్లాట ఘటన చోటు చేసుకోవటంతో ముందస్తు చర్యలో భాగంగా బైండోవర్ చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ కేసులో వైసీపీకి చెందిన వియ్యపు చక్రపాణితో పాటు మరో 13మందిని, టీడీపీకి చెందిన ముంజేటి పురుషోత్తంతో పాటు మరో 12 మంది ని బైండోవర్ చేసి.. లక్ష రూపాయల పూచీకత్తుపై విడుదల చేశామని ఎస్‌ఐ తెలిపారు. ఈ కేసులో మరి కొంతమందిని బైండోవర్ చేయాల్సి ఉందన్నారు.