Share News

బిల్లులు చెల్లించక.. పనులు పూర్తికాక

ABN , Publish Date - Nov 08 , 2026 | 01:12 AM

మండలంలోని శివడ వలస పంచాయతీలో ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌ నిర్మాణం నాలుగేళ్లుగా పునాది దశలోనే నిలిచిపోయింది. ప్రధానంగా బిల్లులు గత ప్రభుత్వం కాలంలో చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయి.

 బిల్లులు చెల్లించక..  పనులు పూర్తికాక
అసంపూర్తిగా నిలిచిపోయిన ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌

బొబ్బిలి రూరల్‌, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): మండలంలోని శివడ వలస పంచాయతీలో ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌ నిర్మాణం నాలుగేళ్లుగా పునాది దశలోనే నిలిచిపోయింది. ప్రధానంగా బిల్లులు గత ప్రభుత్వం కాలంలో చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయి. వైసీపీ హయాం లో గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలన్న ఉద్దేశం తో వెల్‌నెస్‌ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఇందులో భాగంగా గ్రామ సచివాల యాలకు అనుసంధానం చేస్తూ వెల్‌నెస్‌ కేంద్రాలు నిర్వహించేవారు. ప్రతి కేంద్రానికి సొంత భవనం ఉండాలన్న ఆలోచనలో భాగంగా భవన నిర్మా ణాలు ప్రారంభించారు. ఇంతలో 2024లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం వెల్‌నెస్‌ కేంద్రాల పేరును ఆయుష్మాన్‌ ఆరోగ్య మంది ర్‌గా మార్చింది. అయితే వైసీపీ హయాంలో బిల్లులు చెల్లించకపోవ డంతోపాటు నిర్మాణ వ్యయం పెరిగిపోవడం, తదితర కారణాల వల్ల ఈ భవనం పనులు ముందుకుసాగలేదు. ప్రస్తుతం ఈ కేంద్రం అద్దె ఇంట్లో ఇరుకైన గదుల్లో అసౌకర్యాలతో వైద్యసిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. దీంతో రోగులు, వైద్యసిబ్బందికి ఇబ్బందులు తప్పడంలేదు. కాగా శివడ వలస పంచాయతీలో ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌ పనులు పూర్తి చేయడానికి అవసరమైన నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని పీఆర్‌ డీఈ వసంత అప్పారావు తెలిపారు.

Updated Date - Nov 08 , 2026 | 01:12 AM