Share News

బిల్లులు కాక.. పనులు పూర్తికాక

ABN , Publish Date - Jan 17 , 2026 | 12:25 AM

మండలంలోని అలజంగి గ్రామంలో సుమారు రూ. పది లక్షల వ్యయంతో చేపట్టిన వెల్‌నెస్‌ సెంటర్‌ బిల్లులు కాకపోవడంతో పనులు నిలిచిపోయాయి.

బిల్లులు కాక.. పనులు పూర్తికాక
అలజంగిలో అసంపూర్తిగా నిలిచిపోయిన వెల్‌నెస్‌ కేంద్రం :

బొబ్బిలి రూరల్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అలజంగి గ్రామంలో సుమారు రూ. పది లక్షల వ్యయంతో చేపట్టిన వెల్‌నెస్‌ సెంటర్‌ బిల్లులు కాకపోవడంతో పనులు నిలిచిపోయాయి. వైసీపీ హయాంలో సచివాలయ వ్యవస్థను ప్రారంభించే సమయంలో వాటికి అనుబంధంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని స్థాని కంగా అందింగాలన్న దృక్పధంతో వెల్‌నెస్‌ సెంటర్లు ఏర్పాటుచేశారు. ఇందులో భాగంగా అలజంగిలో సొంత భవనం ఏర్పాటుకు అప్పట్లోనే పనులు ప్రారంభించారు. ఇక్కడ పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. కొద్దిపాటి నిధులు వెచ్చిస్తే ఈ కేంద్రం అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యం లో ఇక్కడ పగలు రాత్రి తేడా లేకుండా మద్యం తాగేందుకు కేంద్రంగా పలువురు వినియోగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెల్‌నెస్‌ కేంద్రం పనులు పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Jan 17 , 2026 | 12:25 AM