Bike Tourism మన్యంలో బైక్ టూరిజం
ABN , Publish Date - Jul 21 , 2026 | 11:39 PM
Bike Tourism in the Agency జిల్లాలోని ప్రకృతి రమణీయ ప్రదేశాలు, అటవీ ప్రాంతాలను పర్యాటకులను పరిచయం చేసేందుకు బైక్ టూరిజాన్ని ప్రోత్సహించాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు.
పార్వతీపురం, జూలై21(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రకృతి రమణీయ ప్రదేశాలు, అటవీ ప్రాంతాలను పర్యాటకులను పరిచయం చేసేందుకు బైక్ టూరిజాన్ని ప్రోత్సహించాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రతి నియోజకవర్గంలో 30 కిలోమీటర్లకు పైగా అటవీ మార్గాల్లో బైక్ రైడింగ్‌కు అనువైన ప్రాంతాలు, జలపాతాలు, ట్రెక్కింగ్ పాయింట్లు, విశ్రాంతి ప్రదేశాలను గుర్తించి నివేదిక ఇవ్వాలని సూచించారు. పర్యాటకులకు స్థానిక ప్రకృతి ఫలాలు, తినుబండారాలు, రాత్రి బసకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. ఈ ఆదివారం నాటికి అనువైన ప్రదేశాలు గుర్తించి ఎమ్మెల్యేల చేతుల మీదుగా బైక్ టూరిజం ప్రారంభించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవోలు ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ఆర్డీవో మాధురి, డీఎఫ్‌వో ప్రసూన తదితరులు పాల్గొన్నారు.