అమరావతి’ చట్టబద్ధతపై బైక్ ర్యాలీ
ABN , Publish Date - Apr 04 , 2026 | 12:26 AM
రాష్ట్ర రాజధానిగా అమరావతి బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే బేబీనాయన ఆధ్వర్యంలో కూటమి పార్టీల శ్రేణులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
‘బొబ్బిలి, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధానిగా అమరావతి బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే బేబీనాయన ఆధ్వర్యంలో కూటమి పార్టీల శ్రేణులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జనసేన పార్టీ ఇన్‌చార్జి గిరడ అప్పలస్వామి, బీజేపీ జి ల్లా కార్యదర్శి ముగడ అనిల్‌కుమార్‌లతో పాటు నియోజకవర్గానికి చెందిన యువత పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీలో భాగంగా స్థానిక గాంధీ విగ్రహా నికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అమరావతిని రాష్ర్టానికి రాజధానిగా గుర్తించి చట్టబద్ధత కల్పిం చి, తెలుగువారికి గౌరవాన్ని అందించిన ప్రధాని నరేంద్ర మోడీకి బొబ్బిలి ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇందుకోసం చాలా కృషి చేశారన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు గెంబలి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.