Share News

ఘాట్‌రోడ్డులో బైక్‌ బోల్తా

ABN , Publish Date - Aug 02 , 2026 | 12:39 AM

విశాఖపట్నం జిల్లా పద్మనాభంలోని ఘాట్‌ రోడ్డులో బైక్‌ అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

ఘాట్‌రోడ్డులో బైక్‌ బోల్తా

  • దంపతులకు తీవ్ర గాయాలు

పద్మనాభం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం జిల్లా పద్మనాభంలోని ఘాట్‌ రోడ్డులో బైక్‌ అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, 108 వాహనం సిబ్బంది చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి... విజయనగరానికి చెందిన దంపతులు బి.క్రాంతి(38), బి.త్రివేణి(32) శనివారం ఘాట్‌ రోడ్డుమీదుగా మోటారు సైకిల్‌పై కొండపైకి వెళ్లి అనంత పద్మనాభస్వామిని దర్శించుకున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటల సమయంలో ఘాట్‌ రోడ్డు దిగుతుండగా మలుపు వద్ద వాహనం అదుపు తప్పి పక్కనున్న గోతిలో పడ్డారు. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే ఉన్న పశువుల కాపరి క్షతగాత్రులను గుర్తించి 108 కాల్‌ సెంటర్‌కు ఫోను చేశారు. వెంటనే వాహనం రాగా సిబ్బంది ఈఎంటీ మధుకుమార్‌, పైలట్‌ రమణరాజులు వారిని రోడ్డుపైకి తీసుకువచ్చి ప్రథమ చికిత్స చేసి విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆ దంపతులు చికిత్స పొందుతున్నారు.

Updated Date - Aug 02 , 2026 | 12:39 AM