Share News

బైకు బోల్తా.. డాక్‌యార్డు ఉద్యోగి మృతి

ABN , Publish Date - Jan 17 , 2026 | 12:38 AM

ములక్కాయవలస సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖలోని డాక్‌యార్డు ఉద్యోగి డోల మధు (28) మృతిచెందగా మరో ఇద్దరు యువకులు గాయపడ్డారు.

 బైకు బోల్తా.. డాక్‌యార్డు ఉద్యోగి మృతి

మక్కువ రూరల్‌, జనవరి 16(ఆంధ్రజ్యోతి): ములక్కాయవలస సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖలోని డాక్‌యార్డు ఉద్యోగి డోల మధు (28) మృతిచెందగా మరో ఇద్దరు యువకులు గాయపడ్డారు. ఎస్‌ఐ ఎం.వెంకటరమణ కథనం మేరకు.. మక్కువ ఎస్సీ కాలనీకి చెందిన డోల మధు మరో ఇద్దరితో కలిసి ద్విచక్రవాహనంపై చినభోగిలిరోడ్డులో వెళ్తున్నారు. ద్విచక్ర వాహనం ములక్కాయవలస సమీపంలో బోల్తా పడడంతో ముగ్గురు గాయ పడ్డారు. వీరిలో డోలమధు తలకు బలమైన దెబ్బతగలడంతో మక్కువ పీహెచ్‌సీలో ప్రఽథమచికిత్స అనంతరం పార్వతీపురం ఏరియాఆసుపత్రికి తరలిం చారు. అక్కడ చికిత్స పొందుతూ మధు మృతిచెందాడు. గాయపడిన కొయ్యాన కార్తీక్‌, గునాన కార్తిక్‌లకు కూడ దెబ్బలు తగలగా ప్రస్తుతంవారు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jan 17 , 2026 | 12:38 AM