Share News

వ్యాన్‌ను ఢీకొన్న బైక్‌: వ్యక్తి మృతి

ABN , Publish Date - Jun 10 , 2026 | 12:07 AM

ఆగి ఉన్న కోళ్ల వ్యానును ద్విచక్ర వాహనం ఢీకొ ట్టిన ఘటనలో ఒక వ్యక్తి మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

 వ్యాన్‌ను ఢీకొన్న బైక్‌: వ్యక్తి మృతి

గుర్ల, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): ఆగి ఉన్న కోళ్ల వ్యానును ద్విచక్ర వాహనం ఢీకొ ట్టిన ఘటనలో ఒక వ్యక్తి మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గుర్ల మండలంలోని కోటగండ్రేడు సమీపంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గుర్ల మండలం ఆనందపురం గ్రామానికి చెందిన నేతేటి తవిటినాయుడు(54) తాపీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పనిలో భాగంగా సోమవారం ఉదయం విజయనగరం వెళ్లి, తిరిగి రాత్రి స్వగ్రా మానికి వస్తున్నాడు. కోటగండ్రేడు సమీపంలోకి వచ్చేసరికి రోడ్డు పక్కన ఎటు వంటి సిగ్నల్‌ లైట్‌ వేయకుండా పార్కింగ్‌ చేసిన కోళ్ల వ్యానును ప్రమాదవశాత్తు ఢీకొన్నాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన తవిటినాయుడు అక్కడికక్కడే మృతిచెం దాడు. ద్విచక్రవాహనంపై అతని వెనుక కూర్చున్న దుర్గకు తీవ్ర గాయాలయ్యా యి. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ పి.నారాయణరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Updated Date - Jun 10 , 2026 | 12:07 AM