బీజేపురాన్ని ‘ముస్తాబు’ చేయాలి
ABN , Publish Date - Apr 01 , 2026 | 12:12 AM
మండలంలోని బీజేపురం పంచాయతీని ఏప్రిల్ 15లోగా ముస్తాబుగా తీర్చిదిద్వాలని ఎంపీడీవో హరిప్రసాద్, సచివాలయ సిబ్బందిని డీపీవో కొండలరావు ఆదేశించారు.
జియ్యమ్మవలస, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బీజేపురం పంచాయతీని ఏప్రిల్ 15లోగా ముస్తాబుగా తీర్చిదిద్వాలని ఎంపీడీవో హరిప్రసాద్, సచివాలయ సిబ్బందిని డీపీవో కొండలరావు ఆదేశించారు. మంగళవారం బీజేపురం పంచాయతీ లో సర్పంచ్, గ్రామ పెద్దలు, సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శితో సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపురం పంచాయతీకి కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి ఈనెల 15వ తేదీన రానుండడంతో సుందరంగా తీర్చిదిద్దాలని కోరారు. అనంతరం చినమేరంగిలో డీపీవో ఇంటి పన్ను వసూళ్లు, పారిశుధ్యంపై సమీక్షించారు.మండలంలో 27 పంచాయతీల్లో శతశాతం ఇంటి పన్నులు వసూలు చేయడంతో ఎంపీడీవో హరిప్రసాద్‌ను, గ్రామ కార్యదర్శులను అభినందించారు. మిగిలిన నాలుగు పంచాయతీల్లో మంగళవారం సాయంత్రంలోగా శత శాతం ఇంటి పన్ను వసూళ్లు పూర్తి చేయాలని ఆదేశించారు.