Bhogi సాలూరులో ముందు రోజే భోగి మంటలు
ABN , Publish Date - Jan 13 , 2026 | 12:10 AM
Bhogi Bonfires Light Up Salur a Day in Advance ఏటా భోగి పండుగగా నిర్ణయించిన రోజు కంటే ఒక రోజు ముందు సాలూరు, పాచిపెంట ప్రాంతాల్లో భోగి మంటలు వేయడం ఆచారంగా వస్తోంది.
సాలూరు రూరల్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి : ఏటా భోగి పండుగగా నిర్ణయించిన రోజు కంటే ఒక రోజు ముందు సాలూరు, పాచిపెంట ప్రాంతాల్లో భోగి మంటలు వేయడం ఆచారంగా వస్తోంది. ఈ నెల 14న భోగి పండుగ నిర్వహించనున్నారు. సాలూరు, పాచిపెంటల్లో ఈ నెల 13న (మంగళవారం) భోగి మంటలు వేయనున్నారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఈ ప్రాంతంలో భోగి మంటలు వేసేందుకు స్థానికులు ఏర్పాట్లు చేస్తున్నారు.