భోగాపురం.. మరో భాగ్యనగరం
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:11 AM
భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమవుతున్న నేపథ్యంలో మరో భాగ్యనగరంగా మారనుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు.
గుమ్మలక్ష్మీపురం, జనవరి5 (ఆంధ్రజ్యోతి): భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమవుతున్న నేపథ్యంలో మరో భాగ్యనగరంగా మారనుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. సోమవారం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయంతో శ్రీకారం చుట్టారన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ జిల్లాలో పారిశ్రామిక, వాణిజ్య ప్రగతికి ఈ విమానాశ్రయం దోహపడుతుందన్నారు. అనంతరం ఆమె ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి అధికారులతో చర్చించారు.