ఘనంగా భీష్మ ఏకాదశి
ABN , Publish Date - Jan 29 , 2026 | 11:19 PM
జిల్లా వ్యాప్తంగా గురువారం భీష్మ ఏకాదశి పూజలు ఘనంగా జరిగాయి.
సాలూరు, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా గురువారం భీష్మ ఏకాదశి పూజలు ఘనంగా జరిగాయి. వేకువజామునే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఓం నమో నారాయణాయ, గోవింద గోవింద నామస్మరణలతో ఆలయాలు మార్మోగాయి. భీష్మ ఏకాదశి సందర్భంగా సాలూరు పట్టణంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళలు సామూహిక కుంకుమ పూజలు చేశారు.