వెయిట్ లిఫ్టింగ్‌లో భార్గవి ప్రతిభ
ABN , Publish Date - Apr 28 , 2026 | 12:09 AM
యూత్, జూనియర్ కామన్‌వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో కొండవెల గాడ క్రీడాకారిణి బెల్లాన భార్గవి ప్రతిభ కనబరిచారు.
నెల్లిమర్ల, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): యూత్, జూనియర్ కామన్‌వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో కొండవెల గాడ క్రీడాకారిణి బెల్లాన భార్గవి ప్రతిభ కనబరిచారు. సోమవారం నుంచి సమోవా దేశంలో ప్రారంభమైన ఈ పోటీల్లో భార్గవి పాల్గొని.. స్నాచ్ 78 కిలోలు, క్లీన్ జర్క్ 102 కిలోలు మొత్తం 180 కిలోలు బరువెత్తి బంగారు, రజత పతకాలు సాధించారు. ఆమెను కోచ్‌లు చల్లా రాము, వల్లూరి శ్రీనివాసరావు, రాష్ట్ర, జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు.