ప్రజలకు మెరుగైన సేవలందించాలి: ఎస్పీ
ABN , Publish Date - Oct 11 , 2026 | 12:24 AM
ప్రజ లకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ దామోదర్ పోలీసు అధికారులను ఆదేశించారు.
విజయనగరం, అక్టోబరు 10 ( ఆంధ్రజ్యోతి): ప్రజ లకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ దామోదర్ పోలీసు అధికారులను ఆదేశించారు. శనివారం విజ యనగరంలోని టూటౌన్ పోలీసుస్టేషన్‌ను సందర్శించి స్టేషన్ ప్రాంగణంతో పాటు కంప్యూటర్ రూము, రికా ర్డులను, సీడీ ఫైల్స్‌ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ కేసుల్లో సీజ్ చేసి స్టేష న్ ప్రాంగణంలో భద్రపరిచిన మోటర్ సైకిళ్లను నిబం ధనలకు అనుగుణంగా చర్యలు చేపట్టి, వాహనదారు లకు తిరిగి ఇవ్వాలని ఆదేశించారు. టెక్నాలజీని అంది పుచ్చుకుని స్మార్ట్ పోలీసింగుతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. పైడిమాంబ సిరిమా ను తరలింపు, సిరిమానోత్సవం సజావుగా, శాంతియు తంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా స్థానిక యువకులతో సమన్వయం చేయాల ని ఆదేశించారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐలు కృష్ణమూర్తి, ప్రమీలా ఇతర పోలీసు అధికా రులు పాల్గొన్నారు.
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు
నేరాల నియంత్రణ చర్యల్లో భాగంగా ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఐ క్వాలిటీ సీసీ కెమె రాలు ఏర్పాటు చేశామని ఎస్పీ దామోద ర్ తెలిపారు. శనివారం విజయనగరం వన్‌టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన 12 సీసీ కెమెరాలను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కాంప్లెక్స్‌కు రోజు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు వివిధ ప్రాంతాల నుంచి వస్తూ, పోతుంటారని తెలిపారు. కాంప్లె క్స్‌లో జేబు దొంగతనాలు, బ్యాగు కటింగ్, చైన్‌స్నాచింగ్, ఈవ్‌టీజింగ్, గంజాయి అక్ర మ రవాణా చేధించేందుకు హై క్వాలిటీ నైట్ విజన్ సీసీకెమెరాలు ఏర్పాటు చేశామ ని చెప్పారు. నిరంతరం నిఘా పెట్టేందుకు ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాం గణంలో మొత్తం 44 కెమెరాలు పనిచేస్తున్నాయని తెలిపారు. కాంప్లెక్స్ నుంచి అన్ని ప్రాంతాలు కవర్ అయ్యేలా మరిన్ని కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు లక్ష్మణమూ ర్తి, సీఐలు ఆర్‌వీఆర్‌కె చౌదరి, డీడీ నాయుడు, ఆర్టీసీ మేనేజరు శ్రీనివాసరావు, ఎస్‌ఐలు సురేంద్రనాయు డు, రవి, ప్రసన్నకుమార్, స్టేషన్ మేనేజరు దుర్గరాజు పాల్గొన్నారు.