ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన ఫలితాలు
ABN , Publish Date - May 13 , 2026 | 12:30 AM
ప్రభుత్వ పాఠ శాలల్లోనే విద్యార్థులకు మెరుగైన ఫలితాలు వస్తున్నా యని డీఈవో మాణిక్యంనాయుడు అన్నారు.
డీఈవో మాణిక్యంనాయుడు
పూసపాటిరేగ, మే 12(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠ శాలల్లోనే విద్యార్థులకు మెరుగైన ఫలితాలు వస్తున్నా యని డీఈవో మాణిక్యంనాయుడు అన్నారు. మంగళ వారం రెల్లివలస జడ్పీ హైస్కూల్‌లో ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, ర్యాలీలో పాల్గొన్నారు. ఈసందర్భంగా 1 నుంచి 6 తరగతుల్లో 33 మంది విద్యార్థులకు పాఠ శాలల్లో ప్రవేశం కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం బి.శంకరావు, ఎంఈవోలు రాజ్ కుమార్, పాపినాయుడు, సర్పంచ్ ఇజ్జరోతు ఈశ్వర రావు, అప్పలరాజు, ఉపాఽధ్యాయులు పాల్గొన్నారు.
భోగాపురం, మే 12(ఆంధ్రజ్యోతి): తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని డీఈవో మాణిక్యంనాయుడు సూచించారు. రావాడ జడ్పీ ఉన్న త పాఠశాల, ప్రాథమిక పాఠశాలల్లో మంగళవారం నిర్వహించిన బడి పిలుస్తోంది కార్యకమ్రంలో ఆయన పాల్గొన్నారు. రావాడ హైస్కూల్లో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థి కె.అమూల్యని, తల్లిదండ్రులను సన్మానించా రు. ఎంఈవోలు రమణమూ ర్తి, చంద్రమౌళి, హెచ్‌ఎం సూర్యనారాయణ, ఉపాధ్యా యులు పాల్గొన్నారు.
గజపతినగరం, మే 12(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించే దిశగా తల్లిదండ్రులు కృషి చేయాలని డిప్యూటీ డీఈవో కె.మోహనరావు అన్నా రు. మంగళవారం మదుపాడ గ్రామంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో మౌలిక వసతుల కల్పనతో పాటు నాణ్యమైన విద్యను అంది స్తున్నారని చెప్పారు. గ్రామంలో ఆరుగురు పిల్లలకు ప్రభుత్వం పాఠశాలలో చేర్చేందుకు అడ్మిషన్లు ఇచ్చారు. ఎంఈవో విమలమ్మ, గ్రామ కార్యదర్శి రోషిణి తదిత రులు పాల్గొన్నారు. హెచ్‌ఎం ఎంకే కస్తూ రి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.