మెరుగైన వైద్యసేవలే లక్ష్యం
ABN , Publish Date - Jul 16 , 2026 | 11:21 PM
ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో ప్రజలకు పూర్తిస్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తానని నూతన డీఎంహెచ్‌వో విజయలక్ష్మి తెలిపారు. గుంటూరు మహిళా కళాశాల ప్రిన్సిపాల్(ఆర్టీసీ)గా విధులు నిర్వహిస్తున్న ఆమె బదిలీపై ఇక్కడకు వచ్చారు.
పార్వతీపురం, జూలై16(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో ప్రజలకు పూర్తిస్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తానని నూతన డీఎంహెచ్‌వో విజయలక్ష్మి తెలిపారు. గుంటూరు మహిళా కళాశాల ప్రిన్సిపాల్(ఆర్టీసీ)గా విధులు నిర్వహిస్తున్న ఆమె బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఈ మేరకు గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా బాధ్య తలు స్వీకరించారు. కాగా ఇప్పటివరకు మన్యం డీఎంహెచ్‌వోగా ఉన్న భాస్కరరావు విశాఖకు బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో నియమితులైన విజయలక్ష్మి విలేఖర్లతో మాట్లాడుతూ.. జిల్లాలో మలేరియా, టైఫాయిడ్ , జ్వరాల నివారణకు చర్యలు తీసుకుంటా మన్నారు. వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పలు జాగ్రత్తలు తీసుకుం టామని వెల్లడించారు. అనంతరం ఆమె కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.