Healthcare Services మెరుగైన వైద్య సేవలే లక్ష్యం
ABN , Publish Date - Jul 25 , 2026 | 11:44 PM
Better Healthcare Services Are the Goal మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. శనివారం బిటివాడ బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్‌ను సందర్శించారు. మందుల నిల్వలు, ల్యాబ్ పరీక్షలు, మౌలిక వసతులను పరిశీలించారు. వైద్య సేవలపై ఆరా తీశారు.
వీరఘట్టం, జూలై 25(ఆంధ్రజ్యోతి): మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. శనివారం బిటివాడ బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్‌ను సందర్శించారు. మందుల నిల్వలు, ల్యాబ్ పరీక్షలు, మౌలిక వసతులను పరిశీలించారు. వైద్య సేవలపై ఆరా తీశారు. అత్యవసర మందులు, వైద్య సామగ్రి అందుబాటులో ఉంచాలని వైద్య సిబ్బందికి సూచించారు. సమయపాలన పాటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. గ్రామీణ, గిరిజన ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం బిటివాడ ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. చదువుతో పాటు క్రీడాలు, సాంస్కృతిక ప్రదర్శనల్లో రాణిం చాలని విద్యార్థులకు సూచించారు. ఒత్తిడిని తగ్గించి శారీరక, మానసిక వికాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈ సందర్భంగా కోలాటం ప్రదర్శనతో ఆకట్టుకున్న విద్యార్థినులను అభినందించారు. గట్టుమీద చెట్టు కార్యక్రమంలో భాగంగా అదే గ్రామంలోని పొలం గట్లపై కలెక్టర్ మొక్కలు నాటారు. దీనివల్ల రైతులకు భవిష్యత్‌లో అదనపు ఆదాయం సమకూరుతుందన్నారు. మొక్కల నాటడం వల్ల పర్యావరణ సమతుల్యతను కాపాడడంతో పాటు నేలకోతను నివారించొచ్చన్నారు. భూసారాన్ని కూడా పరిరక్షించొచ్చని తెలిపారు. నాటి ప్రతి మొక్కనూ సరక్షించాలని, అధికారులు, రైతులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఆయన వెంట పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ఉపాధ్యాయులు, విద్యాశాఖాధికారులు ఉన్నారు.