Share News

క్రమశిక్షణతో చదివితే ఉత్తమ ఫలితాలు

ABN , Publish Date - Jan 29 , 2026 | 11:17 PM

ఇంటర్‌ విద్యార్థులు ప్రణాళిక ప్రకారం, క్రమశిక్షణతో చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని ఎస్పీ మాధవరెడ్డి అన్నారు.

క్రమశిక్షణతో చదివితే ఉత్తమ ఫలితాలు
మాట్లాడుతున్న ఎస్పీ మాధవరెడ్డి

- ఎస్పీ మాధవరెడ్డి

బెలగాం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ విద్యార్థులు ప్రణాళిక ప్రకారం, క్రమశిక్షణతో చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని ఎస్పీ మాధవరెడ్డి అన్నారు. గురువారం స్థానిక జీజే కళాశాల మైదానంలో పట్టణ సీఐ వెంకటరావు ఆధ్వర్యంలో నిర్వహించిన స్ఫూర్తి-విజయానికి సోపానం అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ మాధవరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు ఒక ప్రణాళికతో చదవాలన్నారు. పరీక్ష రాయడానికి సాధన ఎంత అవసరమో, రాసేటప్పుడు ప్రదర్శన కూడా అంతే అవసరమన్నారు. సహనం, సాధన, క్రమశిక్షతో చదవడం వలన మంచి ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సెల్‌ఫోన్లను మంచికే తప్ప చెడు మార్గాలకు ఉపయోగించరాదని తెలిపారు. ఎవరైనా సైబర్‌ మోసాలకు గురైతే 1930కి ఫిర్యాదు చేయాలని అన్నారు. ఇంటర్‌ పరీక్షలకు ఏ విధంగా సన్నద్ధం అవ్వాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపై మోటివేషన్‌ స్వీకర్స్‌ చంద్రశేఖర్‌, ఉదయ్‌ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతిభావంతులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు వెంకటేశ్వరరావు, మనీషారెడ్డి, ఎస్‌ఐలు, డీఐఈవో నాగేశ్వరరావు, అధ్యాపకులు, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Jan 29 , 2026 | 11:17 PM