నమ్మండి.. ఇది రోడ్డే
ABN , Publish Date - Jul 10 , 2026 | 11:44 PM
చోళపదం పంచాయతీ పరిధిలోని రెబ్బ-వనధార రహదారి బురదమయంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా చిత్తడిగా మారింది.
-అధ్వానంగా రెబ్బ-వనధార రహదారి
- ప్రజలకు తప్పని ఇబ్బందులు
కొమరాడ, జూలై 10 (ఆంధ్రజ్యోతి): చోళపదం పంచాయతీ పరిధిలోని రెబ్బ-వనధార రహదారి బురదమయంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా చిత్తడిగా మారింది. రోడ్డు పనులను కాంట్రాక్టర్ మధ్యలో నిలిపివేయడంతో పరిస్థితి మరింత దారుణంగా మారిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం గ్రామ యువకులు అనీల్, పారయ్య, జగదీష్ బురదలో నిలిచిన వర్షపునీటిని పారలతో మళ్లించే ప్రయత్నం చేశారు. ఈ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని పెండింగ్‌లో ఉన్న రోడ్డు పనులను వెంటనే పూర్తి చేసి గిరిజన గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.