This Is a BT Road! నమ్మండి.. ఇది బీటీ రోడ్డే!
ABN , Publish Date - Aug 21 , 2026 | 12:11 AM
Believe It or Not.. This Is a BT Road! ఇది మక్కువ మండలం కవిరిపల్లి-తెలగడవలస రోడ్డు. మట్టి రహదారిలా కనిపిస్తున్నా.. ఇది ఒకప్పుడు బీటీ రోడ్డే. 2018లో రూ.కోటి 20లక్షల ‘ఉపాధి’ నిధులతో బీటీ రోడ్డును నిర్మించారు. అయితే పనుల్లో నాణ్యతా లోపాల కారణంగా రోడ్డును నిర్మించిన అనతికాలంలోనే పాడై ఇలా మట్టిరోడ్డులా మారింది. దీంతో 24 గిరిజన గ్రామాల ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు.
24 గిరిజన గ్రామాల ప్రజలకు తప్పని అవస్థలు
మక్కువ, ఆగస్టు20(ఆంధ్రజ్యోతి): ఇది మక్కువ మండలం కవిరిపల్లి-తెలగడవలస రోడ్డు. మట్టి రహదారిలా కనిపిస్తున్నా.. ఇది ఒకప్పుడు బీటీ రోడ్డే. 2018లో రూ.కోటి 20లక్షల ‘ఉపాధి’ నిధులతో బీటీ రోడ్డును నిర్మించారు. అయితే పనుల్లో నాణ్యతా లోపాల కారణంగా రోడ్డును నిర్మించిన అనతికాలంలోనే పాడై ఇలా మట్టిరోడ్డులా మారింది. దీంతో 24 గిరిజన గ్రామాల ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. కవిరిపల్లి నుంచి తెలగడవలస, మార్కొండపుట్టి గ్రామాలకు వెళ్లే రోడ్డు పూర్తి పాడైంది. సుమారు 8 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రహదారిని బాగుచేస్తే ప్రజలకు రవాణా కష్టాలు తీరుతాయి. కాగా ప్రస్తుతం రోడ్డు అధ్వానంగా మారడంతో కవిరిపల్లి, ఎస్.ఆర్.పురం, తోటవలస తదిరతర పది గ్రామాలతో పాటు దుగ్గేరు ప్రాంతంలోని 14గ్రామాల గిరిజనులకు అవస్థలు తప్పడం లేదు. దారంతా గోతులమయంగా మారడంతో వాహనాలపై కూడా రాకపోకలు సాగించలేకపోతున్నారు. కవిరిపల్లి మీదుగా.. శంబర పీహెచ్‌సీకి వచ్చి వైద్యసేవలు కూడా పొందలేకపోతున్నారు. బ్యాంకు, వ్యవసాయ పనులకు కూడా మార్కొండపుట్టి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇక చినుకుపడితే దారంతా బురదమయంగా మారడంతో గిరిజన గ్రామస్థుల బాధలు రెట్టింపవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంతవాసులు కోరుతున్నారు. దీనిపై ఐటీడీఏ ఏఈ పీవీ సత్యనారాయణను వివరణ కోరగా.. ‘కవిరిపల్లి రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తాం. నిధుల మంజూరైతే పనులు చేపడతాం.’ అని తెలిపారు.