Share News

Behind the ‘victory’… ‘విజయ’ం వెనుక..

ABN , Publish Date - Oct 30 , 2026 | 12:19 AM

Behind the ‘victory’… ఉత్తరాంధ్రలో విశాఖ తరువాత అతి పెద్దగా విస్తరించిన విజయనగరం కార్పొరేషన్‌కు ఎంతో ఘన చరిత్ర ఉంది. 1888లోనే మునిసిపాల్టీగా అవతరించింది. అంటే 138 సంవత్సరాల కిందట రూపుదాల్చి అంచెలంచెలుగా ఎదిగింది.

Behind the ‘victory’… ‘విజయ’ం వెనుక..

‘విజయ’ం వెనుక..

నగరానికి 138 ఏళ్ల ఘన చరిత

2019లో కార్పొరేషన్‌గా రూపాంతరం

విజయనగరం, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రలో విశాఖ తరువాత అతి పెద్దగా విస్తరించిన విజయనగరం కార్పొరేషన్‌కు ఎంతో ఘన చరిత్ర ఉంది. 1888లోనే మునిసిపాల్టీగా అవతరించింది. అంటే 138 సంవత్సరాల కిందట రూపుదాల్చి అంచెలంచెలుగా ఎదిగింది. ఎంతో మంది నాయకులు పాలించారు. ఒక్కొక్కరి హయాంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రగతి పథంలో నడిచింది. జిల్లా కేంద్రంగా, కార్పొరేషన్‌గా రూపాంతరం చెందింది. ఈ ప్రస్థానంలో పూసపాటి రాజవంశీయుల పాత్ర కీలకం. 1885లో వారే గంటస్తంభం నిర్మించారు. 1894లో గాంధీ పార్కులో నడుస్తున్న వెన్‌లాక్‌ లైబ్రరీని ప్రారంభించారు. 1912లో రాణి అప్పలకొండ తాగునీటి సౌకర్యం కల్పించారు. ఆపై 1936లో తొలి కమిషనర్‌గా చెలికాని వెంగళరావు బాధ్యతలు స్వీకరించారు. 1971లో స్పెషల్‌ గ్రేడ్‌ మునిసిపాల్టీగా మారింది. 1979లో ఉడా పరిధిలో చేరింది. 1998లో సెలక్షన్‌ గ్రేడ్‌ మునిసిపాల్టీ అయింది. 1999లో వార్షికాదాయం రూ.15.96 కోట్లుగా ఉండేది. ప్రస్తుత బడ్జెట్‌ రూ.156 కోట్లకు చేరింది. 2019లో మునిసిపాల్టీ నుంచి కార్పొరేషన్‌గా అవతరించింది. తొలి మేయర్‌గా వైసీపీకి చెందిన వెంపడాపు విజయలక్ష్మి బాధ్యతలు చేపట్టారు.

Updated Date - Oct 30 , 2026 | 12:19 AM