Construction of Houses గృహ నిర్మాణాలు ప్రారంభించాలి
ABN , Publish Date - Sep 08 , 2026 | 12:31 AM
Begin Construction of Houses ల్యాండ్ పొజిషన్ సర్టిఫికెట్లు పొందిన పీఎం జన్‌మన్ గృహ లబ్ధిదారులు త్వరగా ఇళ్ల పనులు ప్రారంభించాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్ జగన్నాథ్ సూచించారు. ఇక ఆలస్యం చేయరాదన్నారు.
సీతంపేట, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): ల్యాండ్ పొజిషన్ సర్టిఫికెట్లు పొందిన పీఎం జన్‌మన్ గృహ లబ్ధిదారులు త్వరగా ఇళ్ల పనులు ప్రారంభించాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్ జగన్నాథ్ సూచించారు. ఇక ఆలస్యం చేయరాదన్నారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో సోమ వారం పలువురు లబ్ధిదారులకు ల్యాండ్ పొజిషన్ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఎం జన్‌మన్ పథకం కింద ప్రభుత్వం అందిస్తున్న రుణ సహాయాన్ని వినియోగించుకొని ఇంటి నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. లబ్ధిదారులకు అవసరమైన సహకారం అందించాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తిచేయాలన్నారు. ఆయన వెంట ఏపీవో చిన్నబాబు, ఆర్‌వోఎఫ్‌ఆర్ సిబ్బంది జగదీష్, మధు తదితరులు ఉన్నారు.