Share News

తల్లిదండ్రులు మందలించారని..

ABN , Publish Date - Nov 27 , 2026 | 12:53 AM

పట్టణంలోని సింగారపు వీధికి చెందిన డర్రు శివకుమార్‌ (24) స్థానిక కోటి చెరువులో పడి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు.

తల్లిదండ్రులు మందలించారని..

  • యువకుడి ఆత్మహత్య

బొబ్బిలి, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని సింగారపు వీధికి చెందిన డర్రు శివకుమార్‌ (24) స్థానిక కోటి చెరువులో పడి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఐటీఐ చదివిన శివకుమార్‌ చెడు వ్యసనాలకు బానిస కావడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఆ యువకుడు మంగళవారం ఇంటి నుంచి వెళ్లి పోయాడు. తిరిగి ఇంటికి వచ్చేస్తాడనుకుని తల్లిదండ్రులు ఎదురుచూశారు. అయితే స్థానిక కోటిచెరువులో శివకుమార్‌ శవమై కనిపించడంతో తల్లిదండ్రులు బోరుమన్నారు. విషయుంం తెలుసుకున్న పోలీసులక మృతదేహాన్ని చెరువులో నుంచి వెలికితీసి సీహెచ్‌సీకి పోస్టుమార్టం నిమత్తం తరలించారు. మృతుడికి తండ్రి పోలారావు, తల్లి, తమ్ముడు విష్ణు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Nov 27 , 2026 | 12:53 AM