Share News

భార్య మందలించిందని..

ABN , Publish Date - Sep 21 , 2026 | 12:05 AM

డొంకినవలస ఎఫ్‌సీ గోదాములకు సమీపంలో ఆదివారం ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

భార్య మందలించిందని..

  • వ్యక్తి ఆత్మహత్య

బాడంగి, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): డొంకినవలస ఎఫ్‌సీ గోదాములకు సమీపంలో ఆదివారం ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ సూర్యకుమారి తెలిపిన వివరాల మేరకు.. తెర్లాం మండలం కూనాయవల స గ్రామానికి చెందిన అలజంగి గణపతి ఓ ప్రైవేట్‌ కళాశాలలో కుక్‌గా పనిచేస్తు న్నాడు. మూడు రోజులుగా అధికంగా మద్యం సేవిస్తుండటంతో భార్య వెంకట లక్ష్మి, గణపతి మధ్య కొద్దిపాటి మనస్పర్థలు తలెత్తాయి. అలాగే గత నెల జీతం రూ.23 వేలకు బదులుగా ఇంటికి రూ.12వేలు మాత్రమే ఇవ్వడంతో భార్య నిల దీసింది. దీంతో శనివారం డ్యూటీకి వెళ్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. ఆది వారం మధ్యాహ్నం డొంకినవలస ఎఫ్‌సీ గోదాము సమీపంలో చెట్టుకు ఉరి వేసు కున్నట్టు అదే గ్రామానికి చెందిన వ్యక్తి గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచా రం అందించారు. విషయం తెలుసుకున్న భార్య, పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాన్ని బాడంగి సీహెచ్‌సీకి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతు డి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి కుమారుడు దీపు, కుమార్తె సమీక్ష ఉన్నారు.

Updated Date - Sep 21 , 2026 | 12:05 AM