Share News

మేనమామ మందలించాడని..

ABN , Publish Date - Nov 30 , 2026 | 12:33 AM

రొంపల్లి గ్రామానికి చెందిన ఉత్తరావల్లి అఖిల (18) చీమల మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది.

 మేనమామ మందలించాడని..
అఖిల (ఫైల్‌)

విద్యార్థిని ఆత్మహత్య

రామభద్రపురం, నవంబరు 29 (ఆంధ్ర జ్యోతి): రొంపల్లి గ్రామానికి చెందిన ఉత్తరావల్లి అఖిల (18) చీమల మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి రామ భద్రపురం హెచ్‌సీ నరసింహ మూర్తి తెలిసిన వివరాల మేరకు అఖిల ఇంటర్మీడియట్‌ చదువుతోంది. తల్లి మృతి చెందడంతో మేన త్త, మేనమామల పెంపకంలో ఉంటోంది. బాగా చదవాలని, ఇంట్లో పనులు నేర్చు కోవాల ని అప్పుడప్పుడు మేనమామ హెచ్చరి స్తుండేవాడు. దాన్ని అపార్థం చేసుకుని అఖిల మనస్తాపానికి గురైంది. ఇంటిలో చీమల మందును శనివారం తాగింది. నురగలు కక్కుకుని ఉండటాన్ని తండ్రి గుర్తించాడు. మేనమామ లింగాల రాము, మేనత్త మారమ్మ తెలియ జేయడంతో వారు బాడంగి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికత్స పొందుతూ అఖిల మృతిచెందింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని హెచ్‌సీ తెలిపారు.

Updated Date - Nov 30 , 2026 | 12:33 AM