Share News

Beachsand Mining తెరపైకి బాచ్‌శాండ్‌ మైనింగ్‌

ABN , Publish Date - Oct 19 , 2026 | 11:15 PM

Beachsand Mining బీచ్‌శాండ్‌ మైనింగ్‌ ప్రతిపాదనలు మళ్లీ తెరపైకి వచ్చాయి. కొన్నేళ్ల క్రితం సర్వే చేపట్టినా నేటివరకూ ఎటువంటి అడుగు పడలేదు. ఇన్నాళ్లకు ఏపీపీఎమ్‌డీసీ(ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్థి సంస్థ)ఆధ్వర్యంలో మరోసారి ప్రతిపాదనలు తీసుకొచ్చినట్లు సమాచారం. ఎంతో విలువైన ఖనిజాల వెలికితీతకు సంబంధించి ప్రభుత్వ అనుమతుల కోసం జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు వచ్చాయి.

Beachsand Mining  తెరపైకి బాచ్‌శాండ్‌ మైనింగ్‌
బీచ్‌శాండ్‌ మైనింగ్‌ కోసం అధికారులకు అందజేసిన మ్యాప్‌

తెరపైకి బాచ్‌శాండ్‌ మైనింగ్‌

రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో లీజుకు ప్రతిపాదనలు

సుమారు 1500 ఎకరాల్లో క్వారీయింగ్‌ చేపట్టే అవకాశం

పూసపాటిరేగ, అక్టోబరు19(ఆంధ్రజ్యోతి): బీచ్‌శాండ్‌ మైనింగ్‌ ప్రతిపాదనలు మళ్లీ తెరపైకి వచ్చాయి. కొన్నేళ్ల క్రితం సర్వే చేపట్టినా నేటివరకూ ఎటువంటి అడుగు పడలేదు. ఇన్నాళ్లకు ఏపీపీఎమ్‌డీసీ(ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్థి సంస్థ)ఆధ్వర్యంలో మరోసారి ప్రతిపాదనలు తీసుకొచ్చినట్లు సమాచారం. ఎంతో విలువైన ఖనిజాల వెలికితీతకు సంబంధించి ప్రభుత్వ అనుమతుల కోసం జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు వచ్చాయి. మండలంలోని కోనాడ, పతివాడ, చింతపల్లి, కొల్లాయివలస పంచాయతీల పరిధిలో బాచ్‌శాండ్‌ క్వారీయింగ్‌కు అనుమతులు కోరుతున్నారు. భూముల మ్యాప్‌లు, జియో కోఆర్డినేటర్ల వివరాలను జిల్లా యంత్రాంగానికి పంపారు. ఆ నాలుగు గ్రామాల పరిధిలో సుమారు 1537 ఎకరాల భూమిని కోరుతూ గనుల ముఖ్య కార్యదర్శి నుంచి ఆదేశాలు వచ్చాయి. దీనిపై ఇప్పటికే సంబంధితశాఖలు కసరత్తు ప్రారంబించాయి. ముఖ్య ఖనిజాలైన ఇల్మనైట్‌, రూటైల్‌, జిర్కాన్‌, ల్యూకాక్సీన్‌, మోనజైట్‌ లాంటి విలువైన ఖనిజాల వెలికితీతకు అనుమతులు కోరుతున్నారు. కోనాడ పరిధిలో సుమారు 800ఎకరాలు, కొల్లాయివలస పరిధిలో సుమారు 100ఎకరాలు, చింతపల్లికి పరిధిలో సుమారు 260ఎకరాలు, పతివాడ పరిధిలో సుమారు 370 ఎకరాలకు ప్రతిపాదనలు కోరుతున్నారని సమాచారం.

- బీచ్‌శాండ్‌ మైనింగ్‌ అంశంపై తహసీల్దారు ఎన్‌వీ రమణను వివరణ కోరగా ప్రస్తుతానికి తమకు ఎటువంటి సమాచారం లేదని, బీచ్‌శాండ్‌ మైనింగ్‌ తమ పరిధిలోకి రాదని, అటవీభూముల విషయం కూడా సంబంధితశాఖ చూసుకుంటుందని తెలిపారు.

Updated Date - Oct 19 , 2026 | 11:15 PM