Share News

నామినేషన్లకు సిద్ధంగా ఉండండి’

ABN , Publish Date - Oct 16 , 2026 | 12:34 AM

పార్వతీపురం పురపాలక సంఘ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఆశావహులు నామినేషన్లకు అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలని ఎమ్మెల్యే విజయచంద్ర సూచించారు.

నామినేషన్లకు సిద్ధంగా ఉండండి’
మాట్లాడుతున్న ఎమ్మెల్యే విజయచంద్ర

పార్వతీపురం రూరల్‌, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం పురపాలక సంఘ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఆశావహులు నామినేషన్లకు అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలని ఎమ్మెల్యే విజయచంద్ర సూచించారు. గురువారం వెంకంపేటలోని టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో మున్సిపాలిటీకి చెందిన చైర్‌పర్సన్‌తో పాటు కౌన్సిలర్లుగా పోటీ చేయాలనుకున్న ఆశావహులు, ముఖ్య నాయకులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్నందున పోటీ చేయాలనుకుంటున్న వారందరూ నామినేషన్లకు అవసరమైన ధ్రువపత్రాలతో పాటు ఇతర పత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచిం చారు. కూటమి పార్టీల సీట్లు సర్దుబాటు ప్రక్రియ పూర్తయిన తర్వాత పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు టిక్కెట్లు కేటాయిస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ పరిశీలకులు దాడి రత్నాకర్‌, నియోజకవర్గ పరిశీలకుడు కోరాడ రాజబాబు ఉన్నారు.

Updated Date - Oct 16 , 2026 | 12:34 AM