Share News

Malaria Eradication మలేరియాలో నిర్మూలనలో భాగస్వాములు కావాలి

ABN , Publish Date - Apr 25 , 2026 | 11:22 PM

Be Partners in Malaria Eradication మలేరియా నిర్మూలనలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని డీఎంహెచ్‌వో ఎస్‌.భాస్కరరావు పిలుపునిచ్చారు. ప్రపంచ మలేరియా వ్యతిరేక దినం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయంలో శనివారం అవగాహనా కార్యక్రమం నిర్వహిం చారు.

 Malaria Eradication  మలేరియాలో నిర్మూలనలో  భాగస్వాములు కావాలి
మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో

పార్వతీపురం, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): మలేరియా నిర్మూలనలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని డీఎంహెచ్‌వో ఎస్‌.భాస్కరరావు పిలుపునిచ్చారు. ప్రపంచ మలేరియా వ్యతిరేక దినం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయంలో శనివారం అవగాహనా కార్యక్రమం నిర్వహిం చారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా నీరు నిల్వ లేకుండా చేయాలని ఆయన సూచించారు. ప్రతివారం తప్పనిసరిగా డ్రైడే నిర్వహించాలన్నారు. గిరిజన, మైదాన ప్రాంతవాసులు దోమతెరలను వినియోగించుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు గ్రామాల్లో ఫీవర్‌ సర్వే చేపడుతూ జ్వర లక్షణాలున్న వారిని గుర్తించాలని వైద్యసిబ్బందిని ఆదేశించారు. అనంతరం వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి ఎం.సూర్యనారాయణ, ఆరోగ్యశాఖ అధికారులు విజయమోహన్‌, జగన్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2026 | 11:22 PM