‘అభివృద్ధిలో భాగస్వాములుకండి’
ABN , Publish Date - Oct 11 , 2026 | 12:15 AM
పట్టణ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే విజయచంద్ర పిలుపు నిచ్చారు.
పార్వతీపురం టౌన్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): పట్టణ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే విజయచంద్ర పిలుపు నిచ్చారు. శనివారం సాయంత్రం పట్టణంలోని 6, 7, 8 వార్డుల్లో రూ. 20 లక్షలతో నిర్మించనున్న సీసీ రహదారుల నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండున్నరేళ్లుగా అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. తాగునీరు, పారిశుధ్య నిర్వహణ తదితర మౌలిక సదుపాయాల కల్పనకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ అభ్యర్థులను ఆయా వార్డుల్లో గెలుపించుకునే బాధ్యతను నాయకులు, కార్యకర్తలదేనన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కమిషనర్ బి.రామ్‌గోపాల్ తదితరులు పాల్గొన్నారు.