Share News

Be Alert సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తం

ABN , Publish Date - Jun 20 , 2026 | 12:15 AM

Be Alert to Seasonal Diseases సీజనల్‌ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో భాస్కరరావు ఆదేశించారు. ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. శుక్రవారం ఉల్లిభద్రలో పరిసరాలను పరిశీలించారు.

Be Alert  సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తం
ఉల్లిభద్రలో వైద్య సిబ్బందికి సూచనలిస్తున్న డీఎంహెచ్‌వో

గరుగుబిల్లి, జూన్‌19(ఆంధ్రజ్యోతి): సీజనల్‌ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో భాస్కరరావు ఆదేశించారు. ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. శుక్రవారం ఉల్లిభద్రలో పరిసరాలను పరిశీలించారు. డ్రైడే కార్యక్రమంలో భాగంగా గ్రామస్థులకు పరిశుభ్రతపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించా లన్నారు. మురుగునీటి నిల్వలు లేకుండా చూడాలన్నారు. కాలువల్లో వ్యర్థాలు తొలగించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు మందుల వినియోగం, ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక పరిశీలన చేయాలన్నారు. దోమలు వ్యాప్తిని అరికట్టాలని ఆదేశించారు. అనంతరం 104 వాహనాల ద్వారా అందుతున్న సేవలపై ఆరా తీశారు. పైలేరియాతో బాధపడుతున్న వారి వివరాలు సేకరించాలన్నారు. ప్రజలు సంచి వైద్యులను ఆశ్రయించరాదని, సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సేవలు పొందాలని సూచించారు. ఆయన వెంట పీహెచ్‌సీ వైద్యాధికారి తిరుమలప్రసాద్‌, డాక్టర్‌ సూర్యకౌశిక్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Jun 20 , 2026 | 12:17 AM