అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Mar 12 , 2026 | 12:10 AM
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని అగ్ని మాపకశాఖ ఏడీఎఫ్‌వో సోమేశ్వరరావు తెలిపారు. సోమవారం భోగాపురం సామాజిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో జిల్లా విపత్తు స్పందన అగ్నిమాపకశాఖ ఆధ్వర్యంలో ఫైర్‌సేఫ్టీలో భాగంగా ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
భోగాపురం, మార్చి 11(ఆంధ్రజ్యోతి): అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని అగ్ని మాపకశాఖ ఏడీఎఫ్‌వో సోమేశ్వరరావు తెలిపారు. సోమవారం భోగాపురం సామాజిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో జిల్లా విపత్తు స్పందన అగ్నిమాపకశాఖ ఆధ్వర్యంలో ఫైర్‌సేఫ్టీలో భాగంగా ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వంట గ్యాస్ సిలిండర్, ఎలక్ట్రికల్, ఆయిల్ మంటలు జరిగే సమయంలో తీసుకోవలిసిన చర్యలపై అవగాహన కల్పించారు. ఆసుపత్రి సిబ్బందితో మంటలు ఆదుపు చేయించి చూపించారు.నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్‌లో భాగంగా సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీహెచ్‌సీ వైద్యాధికారి వెంకటరమణ, డాక్టర్లు షాలిని, అలేఖ్య తదితరులు పాల్గొన్నారు.