ఒత్తిడిని అధిగమించి పరీక్షలు రాయండి
ABN , Publish Date - Mar 12 , 2026 | 12:07 AM
ఒత్తిడిని అధిగమించి పదో తరగతి పరీక్షలు రాయాలని తల్లిదండ్రులతో పాటుగా పాఠశాలకు మంచిపేరు తీసు కురావాలని ఎమ్మెల్యే లలితకుమారి కోరారు.
లక్కవరపుకోట, మార్చి 11(ఆంధ్రజ్యోతి): ఒత్తిడిని అధిగమించి పదో తరగతి పరీక్షలు రాయాలని తల్లిదండ్రులతో పాటుగా పాఠశాలకు మంచిపేరు తీసు కురావాలని ఎమ్మెల్యే లలితకుమారి కోరారు. బుధవారం మండలంలోని జమ్మాదేవిపేట వద్దగల మహాత్మా జ్యోతిభాపూలే బాలికల గురుకుల పాఠశాల ఆవరణలో జ్ఞాన సరస్వతి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం రూ.2.5 లక్షలతో ఏర్పాటుచేసిన తాగునీటి ఆర్వోప్లాంటును ప్రారంభించారు. ఈ సందర్బంగా మా ట్లాడుతూ గతానికి భిన్నంగా మంచి మార్కులు సాధించి ఎక్కువ సంఖ్యలో ఐఐఐటీ సీట్లు సాధించాలన్నారు. కార్యక్రమంలో కేబీఏ రాంప్రసాద్, కరెడ్ల ఈశ్వరరావు, కొట్యాడ ఈశ్వరరావు, రత్నాజీ పాల్గొన్నారు.