Share News

విద్యాసంస్థల ఆవరణలో పొగాకు ఉత్పత్తులు నిషేధం’

ABN , Publish Date - Nov 04 , 2026 | 01:14 AM

విద్యాసంస్థల ఆవరణలో పొగాకు వినియోగం, ఉత్పత్తుల విక్రయాలలు నిషేధమని జిల్లా అసంక్రమిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్‌ టి.జగన్మోహనరావు అన్నారు.

విద్యాసంస్థల ఆవరణలో పొగాకు ఉత్పత్తులు నిషేధం’
ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న డా.జగన్మోహనరావు

‘గరుగుబిల్లి, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): విద్యాసంస్థల ఆవరణలో పొగాకు వినియోగం, ఉత్పత్తుల విక్రయాలలు నిషేధమని జిల్లా అసంక్రమిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్‌ టి.జగన్మోహనరావు అన్నారు. నిబంధనలు సూచించే బోర్డులు ఏర్పాటు చేయాలని, పొగాకు ఉత్పత్తులు వినియోగంతో కలిగే అనర్ధాలపై అవగాహన పెంపొందించాలని ఆయన సూచించారు. మంగళవారం ఉల్లిభద్ర జడ్పీ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. టొబాకో ఫ్రీ ఎడ్యుకేషన్‌ ఇనిస్టిట్యూషన్‌ అమలు తీరును ఆరా తీశారు. పొగాకు నిషేధం పోస్టర్‌ ఉండగా, నిబంధనలు సూచించే బోర్డు ఏర్పాటు చేయించారు. ఎవరైనా పొగాకు వినియోగం, విక్రయాలకు పాల్పడితే కోట్పా యాక్ట్‌ ప్రకారం తగు చర్యలు ఉంటాయన్నారు. స్కూల్స్‌ ఆవరణలో ఉన్న షాపులకు నిబంధనలపై హెచ్చరించాలన్నారు. అనంతరం హెల్త్‌ వెల్‌నెస్‌ కేంద్రాన్ని తనిఖీ చేసి దీర్ఘకాలిక రోగుల పర్యవేక్షణ తీరుపై రికార్డులు, ఆన్‌లైన్‌ వివరాలు పరిశీలించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం శ్రీనివాసరావు, డిప్యూటీ డెమో ప్రసాద్‌, వైద్య సిబ్బంది అనిత, వెంకట సుబ్బలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2026 | 01:14 AM