Share News

బ్యాలెట్‌ బాక్సుల పరిశీలన

ABN , Publish Date - Aug 30 , 2026 | 12:08 AM

స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం బ్యాలెట్‌ బాక్సులను డీడీవో ఎం.కిరణ్‌కుమార్‌ పరిశీలించారు.

బ్యాలెట్‌ బాక్సుల పరిశీలన
బాక్సులను తనీఖీ చేస్తున్న డీడీవో కిరణ్‌కుమార్‌

బొబ్బిలి రూరల్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం బ్యాలెట్‌ బాక్సులను డీడీవో ఎం.కిరణ్‌కుమార్‌ పరిశీలించారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగ స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచిన బ్యాలెట్‌ బాక్సుల సంఖ్య, వాటి ప్రస్తుత పరిస్థితి, తుప్పు పట్టకుండా తీసుకుంటున్న జాగ్రత్తలు, సీలింగ్‌ పరికరాలను డీడీవో పరిశీలించారు. పెద్దవి 55, చిన్నవి 7 బ్యాలెట్‌ బాక్సులు బాగున్నాయని ఉన్నట్టు నిర్దారించారు. అనంతరం సంబంధిత రికార్డులు, రిజిస్టర్లతో నిల్వ ఉన్న బ్యాలెట్‌ బాక్సుల సంఖ్యను సరిచూసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రవికుమార్‌, ఈవోపీఆర్‌డీ కృష్ణమ్మ, డిప్యూటీ ఎంపీడీవో చంద్రమౌళీశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Aug 30 , 2026 | 12:09 AM