Share News

భక్తిశ్రద్ధలతో బక్రీద్‌

ABN , Publish Date - May 28 , 2026 | 11:13 PM

జిల్లాలో బక్రీద్‌ పండుగను ముస్లింలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మసీదుల్లో నమాజ్‌లు చేసి.. ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

 భక్తిశ్రద్ధలతో బక్రీద్‌
జామియా మసీదులో ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు

పార్వతీపురంటౌన్‌, మే 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బక్రీద్‌ పండుగను ముస్లింలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మసీదుల్లో నమాజ్‌లు చేసి.. ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. గురువారం పార్వతీపురం పట్టణంలోని పాలకొండ రోడ్డులో ఉన్న జామియా మసీదులో జిల్లా ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సయ్యిద్‌ ఇబ్రహీం హుస్సేన్‌ ఆధ్వర్యంలో మసీదు గురువు షరీఫ్‌ రబ్బానీ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా రబ్బానీ మాట్లాడుతూ.. అల్లా ఆదేశానుసారం ప్రతి ఒక్క ముస్లిం ఇతరుల పట్ల ప్రేమతో వ్యవహరించాలన్నారు. అసూయ, ద్వేషాలను విడనాడి అందరితో సంతోషంగా జీవించాలని అన్నారు. కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ సంఘం నాయకులు రజాక్‌, జలాల్‌, ఫిరోజ్‌, సఫీ, గౌస్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 28 , 2026 | 11:13 PM