Share News

బక్రీద్‌ను శాంతియుతంగా నిర్వహించుకోవాలి

ABN , Publish Date - May 26 , 2026 | 11:14 PM

జిల్లాలోని ముస్లింలు బక్రీద్‌ పండుగను శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఎస్పీ దామోదర్‌ అన్నారు.

   బక్రీద్‌ను శాంతియుతంగా నిర్వహించుకోవాలి
ఎస్పీకి పుష్పగుచ్ఛం అందిస్తున్న ముస్లిం మత పెద్దలు

అసత్య ప్రచారాలను నమ్మొద్దు

మసీదుల వద్ద భద్రత కట్టుదిట్టం

విజయనగరం ఎస్పీ దామోదర్‌విజయనగరం, మే 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ముస్లింలు బక్రీద్‌ పండుగను శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఎస్పీ దామోదర్‌ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ముస్లిం పెద్ద లతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక మాధ్యమా ల్లో వచ్చే అసత్య ప్రచారాలకు స్పందించకూ డదన్నారు. మతాలు, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించవద్దన్నారు. మసీదులు, ఈద్గాలవద్ద ఎటువంటి అవాంఛనీ య ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్య మైన మసీదుల వద్ద డ్రోన్‌లు, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మసీదులను పరిశీలించే విధం గా పెట్రోలింగ్‌ భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. ఇతర వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాహన పార్కింగ్‌ చేసుకోవాలని సూచించారు. రెచ్చగొట్టే వ్యక్తుల సమాచారాన్ని డయల్‌ 112కు, స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు అందించాలని అన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ సౌమ్యలత, డీఎస్పీ రాఘవులు, సీఐలు ఏవీ లీలారావు, ఆర్‌వీఆర్‌కే చౌదరి, శ్రీనివాసరావు, వై కుంఠరావు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

నేర నియంత్రణలో డ్రోన్‌

వినియోగం క్రియాశీలకం

జిల్లాలో నేరనియంత్రణకు డ్రోన్‌ వినియోగం క్రియాశీలకమని ఎస్పీ దామోదర్‌ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో మహిళా కానిస్టేబుళ్లకు ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో డ్రోన్‌ వినియోగంపై శిక్షణ కార్య క్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో నేరాల నిరోధానికి డ్రోన్ల వినియోగం క్రియాశీలకంగా మారనున్నం దున డ్రోన్‌ ఆపరేటర్లగా మహిళా పోలీసులకు రెండురోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. త్వరలో ప్రతీ పోలీస్‌స్టేషన్‌కు డ్రోన్‌ కెమెరా అందిస్తామన్నారు. ఓపెన్‌ డ్రింకింగ్‌, గంజాయి, పేకాట, కోడిపందాల నియంత్రణకు, ట్రాఫిక్‌ పర్యవేక్షణ, గ్రామదేవత పండుగలు, ముఖ్యమైన బందోబస్తులకు డ్రో న్లను ఉపయో గించాలన్నారు. నేరాలు జరిగేం దుకు అవకాశం ఉన్న ప్రాంతాలకు నాలుగు కిలోమీటర్ల పరిధి వరకూ డ్రోన్‌ పంపి నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ సౌమ్యలత, డీఎస్పీ రాఘవులు, సీఐ లీలారావు పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2026 | 11:14 PM