Share News

28 నుంచి బ్యాడ్మింటన్‌ పోటీలు

ABN , Publish Date - Feb 24 , 2026 | 12:08 AM

జిల్లా కేంద్రంలోని డీఎస్‌ఏ ఇండోర్‌ ఆడిటోరియంలో ఈనెల 28వ తేదీ నుంచి వచ్చేనెల 4వ తేదీ వరకూ ఏపీ రాష్ట్ర మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ వెటరన్‌షిప్‌ పోటీలను నిర్వహిస్తున్నట్టు బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి అప్పలనాయుడు తెలిపారు.

28 నుంచి బ్యాడ్మింటన్‌ పోటీలు

విజయనగరం టౌన్‌, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని డీఎస్‌ఏ ఇండోర్‌ ఆడిటోరియంలో ఈనెల 28వ తేదీ నుంచి వచ్చేనెల 4వ తేదీ వరకూ ఏపీ రాష్ట్ర మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ వెటరన్‌షిప్‌ పోటీలను నిర్వహిస్తున్నట్టు బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి అప్పలనాయుడు తెలిపారు. జిల్లా కేంద్రంలోని బ్యాడ్మింటన్‌ ఇండోర్‌ స్టేడియంలో సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో షెడ్యూల్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 35 నుంచి 55 సంవత్సరాల వయస్సు కలిగిన పురుషులు, స్త్రీలకు.. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2వ తేదీ వరకూ మొదటి విడతగాను, 60 నుంచి 80 సంవత్సరాల వయస్సు కలిగిన వారికి మార్చి 3 నుంచి 4వ తేదీ వరకూ సింగిల్స్‌, డబుల్స్‌, మిక్సిడ్‌ డబుల్స్‌ పోటీలు నిర్వహిస్తా మని తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 400మంది బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు పాల్గొంటారని చెప్పారు. క్రీడాకారులకు ఇండోర్‌ ఆవరణలోనే అల్పాహారంతో పాటు, లంచ్‌ సదుపాయం ఏర్పాటు చేస్తామని తెలిపారు. విజేతలు మార్చి 18 నుంచి 25 వరకూ గోవాలో జరగబోయే జాతీయ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ పోటీ ల్లో రాష్ట్రం తరపున పాల్గొనే అవకాశం కలుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఎన్‌.సురేష్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ కుసుమ బచ్చన్‌, ఈసీ మెంబర్‌ బి.వీర్రాజు, బ్యాడ్మంటన్‌ కోచ్‌ వి.అశోక్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 24 , 2026 | 12:08 AM