Back then, there were values. అప్పట్లో విలువలు ఉండేవి
ABN , Publish Date - Oct 29 , 2026 | 12:15 AM
Back then, there were values. అప్పటి నాయకుల్లో గాని, ప్రజల్లో గాని విలువలు ఉండేవి. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం, ఒకరినొకరు సంస్కారవంతంగా గౌరవించుకోవడం, మాటలు హద్దుమీరకుండా వ్యవహరించడం వంటివి ఉండేవి’ అని బొబ్బిలి మున్సిపల్ మాజీ చైర్మన్ సజ్జా వెంకటరావు తన మనోగతాన్ని వివరించారు.
అప్పట్లో విలువలు ఉండేవి
రూ.160 నిధులతో పాలన చేపట్టా
పదవీకాలం ముగిసే నాటికి రూ.10 లక్షలకు పెంచాను
పనిచేసేవారికే ప్రజలు అందలం ఎక్కించేవారు
ఇప్పుడంతా డబ్బు, మద్యందే హవా
బొబ్బిలి మున్సిపల్ మాజీ చైర్మన్ సజ్జా వెంకటరావు
బొబ్బిలి, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి):
‘అప్పటి నాయకుల్లో గాని, ప్రజల్లో గాని విలువలు ఉండేవి. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం, ఒకరినొకరు సంస్కారవంతంగా గౌరవించుకోవడం, మాటలు హద్దుమీరకుండా వ్యవహరించడం వంటివి ఉండేవి’ అని బొబ్బిలి మున్సిపల్ మాజీ చైర్మన్ సజ్జా వెంకటరావు తన మనోగతాన్ని వివరించారు. ఈయన 39 సంవత్సరాల వయసులో 1995-2000 మధ్య చైర్మన్‌గా వ్యవహరించారు. నాటి అనుభవాలను ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
- మున్సిపల్ చైర్మన్ కాక మునుపు ఒక దఫా కౌన్సిలరుగా కూడా అత్యధిక మెజారితో గెలిచాను. అప్పట్లో ప్రజలు పనిచేసేవారికే పట్టం కట్టేవారు. గౌరవించేవారు. ఈ రోజుల్లో రాజకీయాలు పూర్తి కలుషితం అయిపోయాయి. డబ్బు, మద్యంతో చేసే దందాలదే రాజ్యంగా మారింది. మా హయాంలో మున్సిపాలిటీలో దుబారా ఖర్చులను గణనీయంగా తగ్గించగలిగాము. రూ.160 క్యాష్ నిల్వతో చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాను. పదవీ కాలం ముగిసే నాటికి రూ.10లక్షలకు పైగా పెంచగలిగాను.
- మా హయాంలోనే బొబ్బిలిలో ఐడీఎస్‌ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్‌లను నాలుగు కూడళ్లలో నిర్మించాం. మార్కెట్‌లో నూతన షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేశాం. కళాభారతి ఆడిటోరియంను, ముస్లింలకు షాదీఖానాను ఏర్పాటు చేశాం. తాగునీటి ఇబ్బందులను పరిష్కరించాం. రోడ్లు వేశాం. రెండు అర్బన్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేశాం. 2500 మందికి స్వయంఉపాధి రుణాలను మంజూరు చేశాం. అర్హులైన పేదలకు పెన్షన్లు ఇచ్చాం. అన్ని రకాల కులవృత్తుల వారికి ఆదరణ పథకం కింద ఆధునిక పనిముట్లు అందించండం అప్పట్లో సంచలనం. ఏపీఐఐసీ గ్రోత్‌సెంటరు కూడా మా హయాంలోనిదే. అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ప్రారంభించారు.
- మా హయాంలో కొంతమంది మాపై అవినీతి ఆరోపణలు చేసినప్పుడు బహిరంగ వేదిక నిర్వహించి సవాల్ చేశాం.
- మూడు, నాలుగు దశాబ్దాల క్రితం పురపాలనలో నీతిమంతులు, సమర్థవంతులు, కార్యదీక్షాపరులు, అంకితభావం కలిగిన వారు ఉండేవారు. బాగా చదువుకున్న వారు పురపాలకసంఘంలో అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. పాలనలో రాజకీయ జోక్యం తగ్గాలి. పరిపాలన సజావుగా సాగడానికి పర్యవేక్షణ ఉండాలి తప్ప పెత్తనం ఉండకూడదు.