Back in Just One Day! ఒక్కరోజులోనే తిరిగొచ్చాయ్!
ABN , Publish Date - Jun 15 , 2026 | 12:23 AM
Back in Just One Day! జిల్లా నుంచి శనివారం ఒడిశాకు తరలిన గజరాజులు ఒక్కరోజులోనే తిరిగొచ్చాయి. ఆదివారం సాలూరు మండలం సారిక, మెట్టవలస పరిసరాల్లో దర్శనమిచ్చాయి. దీంతో ఆ ప్రాంతవాసులు భయాం దోళన చెందుతున్నారు.
మక్కువ రూరల్, (సాలూరు రూరల్) జూన్ 14(ఆంధజ్యోతి): జిల్లా నుంచి శనివారం ఒడిశాకు తరలిన గజరాజులు ఒక్కరోజులోనే తిరిగొచ్చాయి. ఆదివారం సాలూరు మండలం సారిక, మెట్టవలస పరిసరాల్లో దర్శనమిచ్చాయి. దీంతో ఆ ప్రాంతవాసులు భయాం దోళన చెందుతున్నారు. శనివారం సాయంత్రం సారిక, నేరళ్లవలస నుంచి ఒడిశా రాష్ట్రం పొట్టంగి పరిసర ప్రాంతాలకు ఏనుగులు తరలివెళ్లడంతో జిల్లావాసులతో పాటు అటవీ శాఖాధికారులు కాస్త ఊపిరిపీల్చు కున్నారు. అయితే ఒడిశా ఫారెస్ఠ్ అధికారులు ఆయా గ్రామాల ప్రజలతో కలిసి ఏనుగుల గుంపును ఆంధ్రా సరిహద్దు గ్రామాలపైపు తరిమేశారు. ప్రస్తుతం గజరాజులు సాలూరు మండలంలోనే తిష్ఠ వేయడంతో 50మంది సిబ్బందితో అటవీశాఖాధికారులు నిఘా ఏర్పాటు చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నామని, ఏనుగుల కదలికలను ట్రాకర్స్‌తో పర్యవేక్షిస్తున్నామని సాలూరు ఫారెస్ట్ రేంజ్‌అధికారి తవిటినాయుడు తెలిపారు.