Share News

బొడ్డవలసలో ‘బచావో సంగ్రామ్‌’

ABN , Publish Date - Feb 08 , 2026 | 12:10 AM

మండలంలోని బొడ్డవలస గ్రామంలో ఎంజీ నరేగా బచావో సంగ్రామ్‌ కార్యక్రమాన్ని శనివారం కాంగ్రెస్‌ నాయకులు నిర్వహించారు.

 బొడ్డవలసలో ‘బచావో సంగ్రామ్‌’
బచావో సంగ్రామ్‌ కార్యక్రమం నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు:

కొమరాడ, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బొడ్డవలస గ్రామంలో ఎంజీ నరేగా బచావో సంగ్రామ్‌ కార్యక్రమాన్ని శనివారం కాంగ్రెస్‌ నాయకులు నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు వంగల దాలినాయుడు, సిరిసిపల్లి సాయి శ్రీనివాస్‌, గొన్లె ధనుంజయ్‌ మాట్లాడుతూ 20 ఏళ్లుగా ఉపాధి హామీ పనిచేస్తున్న ఏపీవో, జూనియర్‌ ఇంజనీర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌, మేట్‌ తదితర సిబ్బందికి ఉద్యోగ భ ద్రత కరువైందని ఆందోళన వ్యక్తంచేశారు. రాజకీయ వేధింపుతో సతమత మవుతున్నారని తెలిపారు. వారికి ఉద్యోగ భ ద్రత కల్పించాలని కోరారు. ఉపాధి హామీ పథకాన్ని పాత పద్ధతిలో కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Feb 08 , 2026 | 12:10 AM