బేబీనాయనకు మంచి పలుకుబడి
ABN , Publish Date - Oct 06 , 2026 | 11:59 PM
ఎమ్మెల్యే బేబీ నాయనకు ప్రభుత్వ పెద్దల దగ్గర మంచి పలుకుబడి ఉందని, ఆయనకు భవిష్యత్‌లో శుభసూచనలు ఉన్నాయని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.
బొబ్బిలి, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే బేబీనాయనకు ప్రభుత్వ పెద్దల దగ్గర మంచి పలుకుబడి ఉందని, ఆయనకు భవిష్యత్‌లో శుభసూచనలు ఉన్నాయని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. మంగళవారం సాయం త్రం స్ధానిక ఇందిరమ్మ కాలనీలో సుమారు రూ.6.50 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బేబీనాయన, బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధి కోసం ఢిల్లీలో పైళ్లు పట్టుకుని తిరుగుతున్నారని, అదే పద్ధతిలో ఎమ్మెల్యే ఈ ప్రాంతాభివృద్ధి కోసం శ్రమిస్తూ మంచి గుర్తింపు పొందారన్నారు. అనంతరం ఎమ్మెల్యే బేబీనాయన, బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లాలం రామలక్ష్మి, విద్యుత్ ఈఈ రఘు, డీఈ శ్రీనివాస్, ఏఈలు, టీడీపీ నేతలు రౌతు రామ్మూర్తి, రాంబార్కి శరత్‌బాబు, కళింగ వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ సుంకరి సాయిరమేశ్, జక్కువ చంద్రశేఖర్, జగదీశ్, రాంబాబు, రామ్మోహన్ పాల్గొన్నారు.