Ayudha Puja celebrated with grandeur at Bobbili Fort బొబ్బిలి కోటలో వైభవంగా ఆయుధ పూజ
ABN , Publish Date - Oct 19 , 2026 | 11:17 PM
Ayudha Puja celebrated with grandeur at Bobbili Fort దసరా ఉత్సవాల్లో భాగంగా బొబ్బిలి కోటలో సోమవారం ఆయుధ పూజను అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాజవంశీయులైన మాజీ మంత్రిమంత్రి ప్రస్తుత అటవీ అభివృద్ధి సంస్ధ చైర్మన్ ఆర్‌వీ సుజయ్‌కృష్ణరంగారావు తన ఇద్దరి సోదరులైన రామకృష్ణరంగారావు, ఎమ్మెల్యే ఆర్‌వీఎస్‌కేకే రంగరావు (బేబీనాయన)తో కలిసి ఆయుధ పూజను దర్బార్‌మహల్‌లో నిర్వహించగా, ఈ పూజా ప్రక్రియను తిలకించేందుకు పలు ప్రాంతాల నుంచి అభిమానులు తరలివచ్చారు.
బొబ్బిలి కోటలో
వైభవంగా ఆయుధ పూజ
సోదరులతో కలిసి పాల్గొన్న మాజీ మంత్రి సుజయ్
ప్రత్యేక ఆకర్షణగా రాజరికపు సంప్రదాయాలు
బొబ్బిలి, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): దసరా ఉత్సవాల్లో భాగంగా బొబ్బిలి కోటలో సోమవారం ఆయుధ పూజను అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాజవంశీయులైన మాజీ మంత్రిమంత్రి ప్రస్తుత అటవీ అభివృద్ధి సంస్ధ చైర్మన్ ఆర్‌వీ సుజయ్‌కృష్ణరంగారావు తన ఇద్దరి సోదరులైన రామకృష్ణరంగారావు, ఎమ్మెల్యే ఆర్‌వీఎస్‌కేకే రంగరావు (బేబీనాయన)తో కలిసి ఆయుధ పూజను దర్బార్‌మహల్‌లో నిర్వహించగా, ఈ పూజా ప్రక్రియను తిలకించేందుకు పలు ప్రాంతాల నుంచి అభిమానులు తరలివచ్చారు. నాటి రాజులు వినియోగించిన రెండు బంగారు, వెండి సింహాసనాలను ప్రధాన కోట నుంచి మేళతాళాలతో, ప్రత్యేక అలంకరణలు, వేషఽధారణలతో వందిమాగధులు, పరివారం సాంప్రదాయ సిద్ధంగా తోడ్కొని వచ్చారు. అనంతరం ముగ్గురు నాయన సోదరులు (సుజయ్‌నాయన, రామ్‌నాయన, బేబీనాయన) రాచరికం ఉట్టిపడేలా వజ్ర వైడూర్యాలతో కూడిన తలపాగాలు, ఆభరణాలు, దుస్తులు ఽధరించి పూజ స్థలానికి చేరుకున్నారు. వారి వెంట కోటలో పనిచేసే ఉద్యోగులంతా పరివారంగా ప్రత్యేక అలంకరణతో ఊరేగింపుగా వచ్చారు. దర్బారు మహల్‌లో అగ్రభాగాన స్వర్ణసింహాసనాన్ని ఏర్పాటు చేసి రెండు వైపులా వెండి సింహాసనాన్ని, సాదా సింహాసనాన్ని ఏర్పాటు చేశారు. స్వర్ణ సింహాసనంపై దివంగత బొబ్బిలి రాజా, నాటి మద్రాసు ఉమ్మడి రాష్ర్టాలకు ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజా ఆర్‌ఎస్‌ఆర్‌కే రంగారావు (బొబ్బిలి రాజవంశంలో ఆఖరి పట్టాభిషిక్తుడు) చిత్రపటాన్ని, వెండి సింహాసనంపై ఆయన తనయుడైన, మాజీ ఎంపీ ఆర్‌వీజీకే రంగారావు (సుజయ్ తండ్రి) చిత్రపటాలను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. మరో సముచితాసనంపై ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయరు స్వామి చిత్రపటాన్ని ఉంచి పూజలు చేశారు.
ఫ పూజలో వెండి కంచాలలో విలువైన నైవేద్యాలను సమకూర్చారు. చారిత్రాత్మకమైన బొబ్బిలి యుద్ధంలో నాటి రాజులతో పాటు, బొబ్బిలి వీరునిగా పేరుగాంచిన తాం డ్రపాపారాయుడు, ఇతర సైన్యం వినియోగించిన తుపాకులు, కత్తులు, డాళ్లకు వేదపండితులు భద్రం శ్రీకాంత్ ఆధ్వర్యంలో శాస్ర్తోక్తంగా పూజలు చేశారు.